సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 SCERT         🌐 School Edu Dept.         🌐 LEARNUNG MANAGEMENT SYSTEM _ SCERT         🌐 * * PGI(Performance Grading Index         🌐 * * DIKSHA WEB         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"    
🌐 భాషను ఎంచుకోండి
అన్ని పోస్ట్‌లు చూపించు
కవిత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2025, బుధవారం

చప్పట్ల సంగీతం

చప్పట్ల సంగీతం    
-డా. సిద్దెంకి యాదగిరి



 




 

తడారి నోరు తెరిచి తండ్లాడుతూ పర్రెలు వారిన నేల
కదిలే కాలాన్ని కరుణించమని గోజాడుతున్నప్పుడు
భూపగుళ్ల సలుపరాలకు మొండి మొగులు
కార్తుల మనసు కరిగి
డల్లులు డల్లులుగా వానజల్లులై కురుస్తుంటది

తనివి తీరా తడిసిన నేల 
పక్కున నవ్వి ఆకు పచ్చని చీర కట్టుకుంటది
సోకులు అద్దుకొన్న పర్యావరణం  
తీరొక్క రంగులతో వాసికెక్కుతది
కంచె రంగుల సింగిడయి పులకిస్తది 
వనం పూలతో పూదిచ్చిన బోనమైతది 
చెట్టూసేమ జాగ అంతా పచ్చదనం అయితది

సింధూ నాగరికత వారసత్వం 
పరవశించీ పరవశించీ ప్రకృతి వశమైతది 
వశమైన ప్రకృతికి కృతజ్ఞత ఆరాధన అయితది
మమకారం మనసుల బంధీఅయి
ఆధ్యాత్మికత ఉప్పొంగి
రకరకాల పూలను మునివేళ్ళు ముద్దాడుతాయి
తన్మయత్వంలో మనసు తారంగమై తాళమై కోకిల గానమైతుంటది
సామూహిక గానం మనసు వేదికపై ఆధ్యాత్మికత ఉప్పొంగుతది

బతుకు మీద ఆశ పుట్టించిన భరోసా
ఆశయాలు దట్టించిన భవిష్యత్తు
అమ్మగా బతుకమ్మగా పురుడు పోసుకుంటది. 
వృద్ధాప్య ఛాయలు పేరుకు పోతున్న 
మనసు మాత్రం తల్లిగారిల్లు మీదికి గుంజుతుంటది

తల్లుల ఆనంద డోలికల తన్మయత్వం 
అక్కా చెల్లెళ్ల ఆనందం కోసం అన్నదమ్ముల అంకిత భావం 
కూర్పు పొద్దుకు పూలజాతరకు కవాతు చేస్తూ కాలినడక
సేకరణ ఒక యాగం దొంతరులుగా పేర్చుట మహత్తర భోగం 
లీనమై ఆడుట మహా యోగం

తొమ్మిది రోజులు తొమ్మిది తీర్ల బతుకమ్మలు 
బతుకుసారం లోంచి అనుభూతులు బోధిస్తయి
అనుభవాలు గుణపాఠాలు
పాటల ఊటలు ప్రవచనాలు
చప్పట్లధ్వని ప్రకృతి నేర్పిన సంగీతం 
పాట సహజసిద్ధ సాహిత్యం 
లయాత్మక అడుగుల సవ్వడి నృత్య రత్నావళి 
సంగీత సాహిత్య నృత్యాల మహా సమ్మేళనం 
మనసున మనసై బతుకమ్మ చుట్టూ పరిభ్రమిస్తుంటది
ప్రకృతి పరచిన మెత్తటి తివాచి ‌గరకలో 
ఉరకలేస్తుంటది బాల్యం
పెద్దలు బాలకులయి బాలకులు పెద్దలయి
తరాల అంతరాలని రూపుమాపుతారు 
బాల్యం బతుకమ్మ చుట్టు చిందేస్తది
డప్పు దరువులలో బతుకమ్మలకు చౌరస్తాలు వేదికయితయి 
బంగారు చీరలతో బజారులు ముత్తెదువలయితయి
మనుషులందరూ అనేకానేక సీతాకోకచిలుకలవుతారు
ఇచ్చిపుచ్చుకోవడం నేర్పే వొయినం
చిరునవ్వుల జలపాతములో సంతోషాలు తడిసి ముద్దయితయి
నిమజ్జనంలో సంవత్సరం అంతా సంతోషాలు కోరుకుంటది
పోయిరావమ్మా బతుకమ్మ పోయి రావమ్మా అంటూ 
బతుకులోకి ఆహ్వానించడమే బతుకమ్మ

-డా. సిద్దెంకి యాదగిరి
9441244773