సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

3, నవంబర్ 2023, శుక్రవారం

IX. 9. కోరస్

IX. 9. కోరస్ 


అన్నపురాసులు ఒకచోట
ఆకలిమంటలు ఒకచోట
హంసతూలికలొక చోట
అలసినదేహాలొక చోట
సంపదలన్నీ ఒకచోట
గంపెడు బలగాలొకచోట
వాసన నూనియలొకచోట
మాసిన తలలింకొక చోట
కమ్మని చకిలాలొక చోట
గట్టిదొడలింకొక చోట
-కాళోజి

ప్రశ్నలు

1. పై కవితాపంక్తులు విషయం గురించి చెప్తున్నాయి?
పై పంక్తులు సంఘంలో ఉండే పరస్పర విరుద్ధ పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. ఆకలి వేసేవాడి దగ్గర అన్నంలేదు. అక్కరలేనివాడి దగ్గర అది పోగుపడి ఉంది అని పంక్తులు తెలుపుతున్నాయి.

2.అలసిన దేహాలకు ఏం కావాలి ?
అలసిన దేహాలకు కొంచెం విశ్రాంతి కావాలి. కడుపునిండా తిండి కావాలి. కాసింత ఓదార్పు కావాలి. శ్రమపడ్డాడనే గుర్తింపు కావాలి. సంఘం యొక్క మన్నన కావాలి.

3.‘అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోటఅంటే మీకేం అర్థమైంది ?
ఆకలి లేనివాడికి, తింటే పడనివాడికి, దిట్టంగా వాడి దగ్గర ధనం, ఆహారపదార్థాలు ఉంటాయి. కాని వాడు వాటిని తినలేడు. వాడికి ఆకలి లేదు. తింటే వాడి ఆరోగ్యం చెడిపోతుంది. ఆకలి వేస్తున్నవాడికి అన్నం కావాలి కాని వాడికి తినడానికి తిండిలేని దరిద్రం. విధంగా సంఘంలో పరస్పర వైరుధ్యాలున్నాయని నాకు అర్థమయ్యింది.

4.“కమ్మని చకిలాలొకచోట గట్టి దౌడలింకొక చోటఅనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
కమ్మని చకిలాలుఅంటే కమ్మని జంతికలు. అవి కొరికి తింటే కమ్మగా ఉంటాయి. వాడి దగ్గర చకిలాలు ఉన్నాయి. కాని గట్టిగా ఉండే వాటిని కొరికి తినడానికి వాడికి గట్టి దౌడలు, దంతాలు లేవు. అంటే కమ్మని చకిలాల ప్రయోజనం వాడికి అందదు. అలాగే మరో వ్యక్తికి గట్టి దౌడలు, దంతాలు ఉన్నాయి.

కాని వాడికి తినడానికి చక్కిలాలు లేవు. వాడికి గట్టి దౌడలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. విధంగా ప్రయోజనం, ఉపయోగం లేనిచోట సంపదలు పోగు పడుతున్నాయి. కావలసిన బీదవాడి వద్ద దరిద్రం ఉంటోందని అర్థం.

 

పాఠం ఉద్దేశం

తన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి, ఏది మంచో, ఏది చెడో తెలుసుకొనేటట్లు చేయడం పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రక్రియ వచనకవిత
పాఠం వచనకవిత ప్రక్రియకు చెందినది. ఛందో నియమం లేని స్వేచ్ఛాకవిత్వాన్ని వచనకవితఅంటారు. చెప్పేది వచనమే చెప్పే మాటల్లో కవిత్వంపాలు వుంటేనే అది వచనకవిత అవుతుంది. వచనకవిత భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. వచనకవితలు వస్తువు- అభివ్యక్తి-శిల్పంఆధారంగా ప్రతిభ కలవిగా గుర్తింపబడతాయి.

పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావుగీతంకవితా సంకలనం లోనిది.

కవి పరిచయం


పాఠం పేరు : కోరస్

కవి : సలంద్ర లక్ష్మీనారాయణ

దేని నుండి గ్రహింపబడింది : కవి రచించిన చావుగీతంకవితా సంకలనం నుండి గ్రహించబడింది.

 జననము : 12-01-1956
మరణము : 17-09-1986

జన్మస్థలము : నిజామాబాద్ పట్టణంలో జన్మించారు

 

తొలి కవితా సంపుటి : వేడిగాలిఅనే కవితా సంకలనం ద్వారా ఈయన తన మొదటి కవితా సంపుటిని అందించారు.

చావుగీతంసంచలనం : 1979లో ఈయన రచించిన చావుగీతంకవితాసంపుటి సంచలనం సృష్టించింది.

దళిత సాహిత్యోద్యమం : కవి రచించిన దళిత మానిఫెస్టోఅనే కవిత, దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్పదగినది.

ప్రవేశిక

వాస్తవాలు కఠినంగా ఉంటాయి. సమాజం కొత్త పోకడలను తొందరగా స్వాగతించదు. అయినా వాటిని గురించి. పదే పదే చెబుతూ, ఆచరిస్తూ ఉంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత గుర్తించి, తర్వాత అనుసరిస్తుంది కూడా. నిజం తెలిసిన కవి తన పాటకు సమాజం కోరస్ అవుతుందని ఎంతో ఆత్మ విశ్వాసంతో ప్రకటిస్తున్నాడు. వైనాన్ని చదివి తెలుసుకుందామా ?

 

 

 

ఇవి చేయండి

I. అవగాహన ప్రతిస్పందన

ప్రశ్న 1.
కోరస్అనే పేరు వినగానే మీకేమనిపించింది ? ‘కోరస్అనే పేరు కవితకు సరిపోతుందా ? ఎందుకు ? మీ అభిప్రాయం చెప్పండి.
జవాబుకోరస్అనే పేరు వినగానే మేము నిత్యమూ పాఠశాలలో బాలబాలికలు అందరూ కలిసి పాడే వందేమాతరం, జనగణమన గేయాలు గుర్తుకు వచ్చాయి. ఒక్కొక్కసారి, పై పాటలను ఒక విద్యార్థి లేక విద్యార్థిని చెపుతూంటే, మిగిలిన పిల్లలం మేము కోరస్ గా అనగా గొంతులు కలిపి ఒకే కంఠధ్వనితో పాడుతాము. లేదా మా పిల్లలం అంతా కలిసి, కోరస్ గా పాడతాము.

కవితకు కోరస్ అనే పేరు, అంతగా సరిపడదు. కాని కవిత చివర, రచయిత సమాజం అంతా చివరకు తన అభిప్రాయాలను గౌరవిస్తుందనీ, అందరూ తనతోపాటే గొంతు కలిపి తన పాటను పాడుతారనీ చెప్పాడు. సమాజం తనతో కోరస్ పాట పాడుతుందని కవి తన ఆకాంక్షనూ, తన ఆత్మ విశ్వాసాన్నీ ప్రకటించాడు.

అందువల్ల వచన కవితకు, ‘కోరస్అన్న శీర్షిక సరిపోవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను.

 

 2.‘కోరస్ కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావన ఎటువంటిదని భావిస్తున్నారు ? చర్చించండి.
జవాబు:
కోరస్కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావనలివి.

  1. సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ, అంత తొందరగా అంగీకరించదు.
  2. భూమ్యాకాశాలకు సంబంధం ఉన్నదని చెపితే, సమాజం నవ్వుతుంది.
  3. పువ్వుకీ, ముళ్ళకూ మధ్య భేదం చెపితే, సమాజం కోపపడుతుంది.
  4. ప్రవాహ నిశ్చలతలకు, రూపం కల్పిస్తే సమాజం ఒప్పుకోదు.
  5. ఆలోచనకూ, ఆచరణకూ అర్థం చెప్తే సమాజం అపార్థం చేసుకుంటుంది.
  6. మేధస్సుకూ, మూర్ఖత్వానికీ ఉన్న పోలికను చెపితే, సమాజం రాళ్ళు విసరుతుంది.
  7. సమాజం యొక్క యథార్థ స్వరూపాన్ని సమాజానికి తెలియపరిస్తే సమాజం ఎదురుతిరుగుతుంది.
  8. సమాజాన్ని ఎవరైనా ఒంటరిగా ఒక వ్యక్తి విమర్శిస్తే, సమాజం వ్యక్తి గొంతును నొక్కేస్తుంది.
  9. సమాజం గురించి తనలో తానే విమర్శించుకుంటున్న వ్యక్తిని, సమాజం పిరికివాడంటుంది. మూర్ఖుడంటుంది. బెదరించి చంపుతుంది.
  10. చివరకు సమాజం తనతో కోరస్ పాడుతుంది.

పై విధమైన భావనలు సమాజం పట్ల కవికి ఉన్నాయి.

 3.కింది కవితా పంక్తులు చదువండి. భావం రాయండి.

ఆకులు లేకుంటే
చెట్టునెలా గుర్తిస్తావు ?
పచ్చదనమే చెట్టుకు చిరునామా ! చెరువులో బంగళాలు మొలిచాయి నీటి తల్లికి ఇన్ని సమాధులా ! చెట్టుతనం కట్టెతనమయ్యింది
చిగురుకలలేవి ? చిటపటలు తప్ప ?
పై కవితా పంక్తుల భావము :
చెట్టుకు ఆకులు లేకపోతే, అది చెట్టో గుర్తించడం ఎలా ? అది చెట్టు అనడానికి దానికి గల పచ్చదనమే గుర్తు. ఈనాడు చెరువులు కప్పుపడి, ప్రాంతంలో భవనాలు కట్టబడ్డాయి. తల్లి వంటి నీటికి ఇలా సమాధులు నిర్మిస్తారా ? చెరువులను కప్పివేస్తారా ? చెట్టు బ్రతికుంటేనే, దానికి చెట్టుతనం ఉంటుంది.

చెట్టు చచ్చిపోతే అది పొయ్యిలో కాల్చే కట్టె వలె అవుతుంది. చచ్చిన చెట్టులో కట్టెతనమే ఉంటుంది. చెట్టు, కట్టెగా మారితే, దానికి చిగురులు పుట్టినట్లు కలలు రావు. దానికి నిప్పుల్లో కాలిపోతున్నప్పుడు వినిపించే చిటపటలే వినబడతాయి.

 

 4.“కోరస్కవిత నుండి కింది భావాలకు తగిన కవితా పంక్తులు గుర్తించండి.

) నాకు భయమన్నదే లేదు నేను ఒక్కడినే నా పాట పాడుకుంటా.
జవాబు:
నాకు భయం లేదు, నేను నేడు, పాట,
ఒంటరిగానే పాడుకుంటాను !

) నేను స్తబ్దంగా వుంటే పిరికివాడంటారు.
జవాబు:
నేను
ఒంటరిగా ఆలోచనలలో
ఊరికే ఊబుసుపోక పరుగులు తీస్తే
నన్ను పిరికివెధవననీ

) వీళ్ళ అసలు రూపాలు చూపిస్తే, తట్టుకోలేక నన్నే విమర్శిస్తారు.
జవాబు:
మీ ముఖాలు చూసుకొండంటూ
ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు అద్దాన్ని
ముక్కలు చెక్కలుగా పగుల గొట్టేస్తారు

 

) ఆలోచనలకు వాటి అమలుకు మధ్య రూపమిస్తే వీళ్ళు అంగీకరించరు.
జవాబు:
ఆలోచనకీ ఆచరణకీ అర్థం చెప్తే
వీళ్ళే అపార్థం చేసుకుంటారు

 

 

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

) తన మీద రాళ్ళు విసురుతారని కవి భావించడంలో అంతరార్థం ఏమిటి ? వివరించండి.
కవి సలంద్ర లక్ష్మీనారాయణ, తన కోరస్ అనే కవితలో, తెలివికీ మూర్ఖత్వానికీ దగ్గర పోలిక ఉందని తాను అంటే, మేధావులు, తన మీద రాళ్ళు విసరుతారని చెప్పాడు. అంటే మేధావులు తనను నిందిస్తారని ఆయన చెప్పాడు.

మూర్ఖుడు తనకు తోచిందే తప్ప ఇతరులు చెప్పిన దానిని విని, మాటల్లోని మంచి చెడ్డలను గ్రహింపడు. మేధావులు కూడా, అంతా తమకే తెలుసుననీ, తమకు ఎవరూ ఏమీ చెప్పనవసరంలేదనీ అనుకుంటారు. ఇతరులు చెప్పింది. వినకపోడం మూర్ఖత్వమనీ, ఒక విధంగా మేధావికీ, మూర్ఖుడికీ పోలిక ఉందనీ చెపితే మేధావి కోపపడతాడు. తనను మూర్ఖుడితో పోల్చి చెప్పినవాడిపై మేధావి రాళ్ళు విసరుతాడు. అంటే కోపపడతాడు.

మేధావి కూడా మూర్ఖుడిలాగానే ఇతరులు చెప్పింది వినడని, మాటల్లోని అంతరార్థము.

) మేధస్సు, మూర్ఖత్వం మధ్య తేడా ఏమిటి ?
మేధస్సు గల మేధావి తానే మేధ గలవాడిననే గర్వంతో ఇతరులు ఎవరైనా ఏదైనా చెపితే అది సరయినదే అయినా, తాను అంగీకరించడు. తనకున్న తెలివితో తాను చెప్పినదే సరయినదని వాదిస్తాడు. తన మూర్ఖపు పట్టు ఎంతమాత్రం విడిచిపెట్టడు.

మూర్ఖుడు కూడా తాను అనుకున్నదే కాని కొత్తదాన్ని అంగీకరించడు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదుఅని భర్తృహరి మూర్ఖుణ్ణి గూర్చి నిజం చెప్పాడు. ఒక విధంగా మేధావి కూడా మూర్ఖుడిలాగే ప్రవర్తిస్తాడు. తాను అనుకొన్నదే తప్ప, ఇతరులు చెప్పిన దానిని అతడు అంగీకరించడు.

దీనిని బట్టి మేధావికీ, మూర్ఖుడికీ పేరులో తప్ప వ్యవహారంలో పెద్దగా తేడా కనిపించదు.

 

) కవి దృష్టిలో మేధావులంటే ఎవరు ?
మేధావులు అంటే, తెలివిగలవారు. సమాజానికి ఏది మంచో, ఏది చెడో తెలిసికోగల బుద్ధిమంతుల్ని మేధావులు అని చెప్పాలి.

మూర్ఖుడి వలె, ఏది చెప్పినా వినని మేధావి కూడా మూర్ఖుడితో సమానమే అని కవి ఉద్దేశ్యము. సమాజంలో వస్తున్న మార్పులను గమనించలేనివారు మేధావులు కారని కవి భావన. ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహింపలేనివాళ్ళు, ప్రజల పక్షాన నిలబడని వాళ్ళు, మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించాలని కవి భావన.


) గొంతునొక్కేయడంఅంటే మీకేమి అర్థమయింది ? ఒక ఉదాహరణ తెలుపండి.
గొంతు నొక్కేయడంఅనేది ఒక పదబంధం. ఒక వ్యక్తి మనసులోని భావాన్ని పైకి చెప్పనీయకుండా అణచివేసే సందర్భంలో జాతీయాన్ని వాడతారు.

బలవంతంగానో, బయపెట్టో లేక మరో రీతిగానో ఒక వ్యక్తి చెప్పదలచుకున్న విషయాన్ని పైకి చెప్పనీయకుండా ఆపు చేయడాన్ని గొంతు నొక్కేయడంఅంటారు.
ఉదా : న్యాయస్థానంలో నిజం చెప్పడానికి వచ్చిన సాక్షి గొంతు నొక్కేశారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

) కోరస్పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటలలో రాయండి.
నేను భూమికీ, ఆకాశానికీ ఉన్న సంబంధాన్ని చెప్తే సమాజం నన్ను చూసి నవ్వుతుంది. పువ్వుకీ, ముళ్ళకీ ఉన్న తేడా చెప్తే సమాజం నాపై కోపపడుతుంది. ప్రవాహానికీ, నిశ్చలతకూ రూపం కల్పిస్తే సమాజం అంగీకరించదు. ఆలోచనలకూ, వాటి అమలుకూ మధ్య రూపమిస్తే సమాజం అంగీకరించదు. మేధావులకూ, మూర్ఖులకూ పోలిక ఉందంటే మేధావులు రాళ్ళతో కొడతారు. వారి అసలు రూపాలు వివరంగా చూపిస్తే నన్ను విమర్శిస్తారు.

 నేను గొంతెత్తి ఒంటరిగా మాట్లాడితే, నా గొంతు నొక్కేయాలని చూస్తారు. ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే, పిరికి వాడవని అంటారు. నన్ను మూర్ఖుడని అంటారు. చూపుడు వేలుతో నన్ను బెదిరించి చంపేస్తారు. అయినా భవిష్యత్తులో నన్ను వ్యతిరేకించినవాళ్ళే, సత్యాన్ని గ్రహించి, తన మాటతో ఏకీభవిస్తారనీ, తనతో కలిసి కోరస్ ఆలపిస్తారనీ కవి ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించాడు.

3. కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

). కవి సలంద్ర ఆలోచనలను, కవిత అంతరార్థాన్ని ప్రశంసిస్తూ ఏదైనా ఒక సాహిత్య పత్రికకు లేఖ రాయండి.
సాహిత్య పత్రికకు లేఖ

siddipeta,
X X X X.

ప్రధాన సంపాదకులు,
సాహితీ కౌముది,
ఉత్తమ సాహిత్య కళా సాంస్కృతిక మాసపత్రిక,
హైదరాబాదు.

సంపాదక మహాశయా!

నమస్కారాలు. మాకు తొమ్మిదవ తరగతిలో దళిత సాహిత్యోద్యమానికి పునాది వేసిన దళిత మానిఫెస్టోకవితా రచయిత సలంద్ర లక్ష్మీనారాయణగారు రాసిన కోరస్వచన కవిత పాఠ్యభాగంగా నిర్ణయింపబడింది. కవితలోని అంతరార్థాన్నీ, కవిగారి ఆలోచనలనూ నాకు నచ్చి లేఖారూపంగా రాస్తున్నా. దయతో దీన్ని పరిశీలించి, మీ సాహిత్య పత్రికలో ప్రచురింప కోరిక.

సలంద్ర వారి కోరస్ కవిత అద్భుతంగా ఉంది. సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ అంత తొందరగా అంగీకరించదనే విషయాన్ని గురించి కవి ఆవేదన వ్యక్తం చేస్తూ, అనేక విధాలుగా తన ప్రశ్నలనూ సందేహాలనూ కోరస్అన్న తన వచన కవితలో వెలిబుచ్చాడు.

ఈయన భూమ్యాకాశాలకు మధ్య ఉన్న సహజ బంధాన్ని గుర్తించాలని, పూల సౌకుమార్యాన్నీ, ముళ్ళ కాఠిన్యాన్నీ గ్రహించాలనీ అంటాడు. నీటి ప్రవాహంలోని చైతన్యానికీ, నీటి నిశ్చలత్వానికీ గల తేడాను గ్రహించాలంటాడు. ఇవేవీ తెలుసుకోకుండా, కోపంతో అపార్థం చేసుకోవద్దంటాడు.

 

ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహించలేనివాళ్ళూ, ప్రజల పక్షాన నిలబడనివాళ్ళూ నిజమైన మేధావులు కారన్న సత్యాన్ని తెలిసికోమంటాడు. ఒంటరిగా తాను ప్రగతిశీల భావాలు పాడుతానంటాడు. తనను పిరికివాడిగా, మూర్ఖుడిగా ముద్రవేసినా తాను లెక్కచేయనన్నాడు. ఇప్పుడు తనను వ్యతిరేకించినవాళ్ళే, భవిష్యత్తులో తనతో ఏకీభవించి, తన పాటతో గొంతు కలిపి, కోరస్ పాడతారన్నాడు. సలంద్ర మహాకవి, అభ్యుదయ కవి.

ఇట్లు,
మీ విశ్వసనీయ
xxxxxx

తొమ్మిదవ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం.

చిరునామా :
ప్రధాన సంపాదకులు,
tangedu
మాసపత్రిక,
 
హైదరాబాదు – 500004

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పదాలకు అర్థాలు రాయండి. పదాలతో సొంతవాక్యాలు రాయండి.

మేధస్సు = తెలివి
ఉదా : వాక్యప్రయోగము : వికసించిన మానవుని మేధస్సు ప్రపంచ ప్రగతికి కారణమైంది. ఆచరించేది, చేసేది.

) ఆచరణ = ఆచరించేది, చేసేది.
వాక్యప్రయోగము : గురువుల ఉపదేశాలు ఆచరణ యోగ్యంగా ఉండాలి.

) ప్రతిబింబం = మారురూపు
సూర్యుడి ప్రతిబింబం చెరువు నీళ్ళలో కనబడుతుంది.

) నిశ్చల = స్థిరత్వము
వాక్యప్రయోగము : సంపూర్ణ నిశ్చలతతో కూడిన మనస్సుతో భగవంతుని స్మరించాలి.

) కోరస్ = గొంతు కలుపటం
వాక్యప్రయోగము : విద్యార్థినీ, విద్యార్థులందరూ కలిసికోరస్ గా జనగణమన గేయం పాడారు.

2. కింది జాతీయాలను వివరించండి.

) రాళ్ళు విసరడంఅంటే లేనిపోని నేరాలు ఆరోపించి తప్పుపట్టడం అని అర్థము. ఎవరైనా ఒక మంచిపని చేస్తోంటే అది చూసి సహించలేని దుర్మార్గులు మంచిపని చేసేవాడిపై లేని నేరాలు ఆరోపించి, అతడిపై దోషాలు ఆరోపిస్తారు. దాన్నే రాళ్ళు విసరడంఅంటారు.

) గొంతు నొక్కేయడంఅంటే మాట పైకి రాకుండా అడ్డుపెట్టడం అని అర్థము. ఎవరైనా ఉన్న సత్యాన్ని ధైర్యంగా వారు గొంతు విప్పి మాట్లాడుతుండగా, వారు మాట్లాడితే సత్యం బయటపడుతుందనే భయంతో, బలవంతంగానో, లేక బెదరించో లేక బతిమాలో, అతడు గొంతువిప్పి మాట్లాడకుండా చేయడాన్ని, ‘గొంతునొక్కేయడంఅంటారు.

 

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను విడదీసి, సంధుల పేర్లను రాయండి.

) చూసుకొండంటూ = చూచుకొండు + అంటు ఉత్వ సంధి

) గొంతెత్తి = గొంతు + ఎత్తి ఉత్వ సంధి

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.

) ముక్కలు చెక్కలు ముక్కలును, చెక్కలును ద్వంద్వ సమాసం

) గొంతునొక్కేయటం = గొంతును నొక్కేయటం ద్వితీయా తత్పురుష సమాసం

) నా పాట = నా యొక్క పాట షష్ఠీ తత్పురుష సమాసం

3. కింది పంక్తులను గమనించి వాటిలో ఉన్న అలంకారములను గుర్తించి రాయండి.

* పువ్వుకీ ముళ్ళకీ భేదం చెప్తే
ప్రవాహానికి నిశ్చలతకీ రూపం కలిస్తే.
ఆలోచనకీ ఆచరణకీ అర్థం చెప్తే

పై గేయపంక్తులలో అంత్యానుప్రాస అలంకారం ఉంది.

లక్షణం : పదాల, పాదాల, వాక్యాల, చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే, అది అంత్యానుప్రాసాలంకారంఅవుతుంది.

సమన్వయము : పై పాదాల్లో పదాల చివర కీఅనే అక్షరం, పునరుక్తమయ్యింది. అంటే తిరిగి తిరిగి వచ్చింది అలాగే వాక్యాల చివరలో ప్తే, స్తే, ప్తే” – అనే సంయుక్తాక్షరం, పునరుక్తమయ్యింది. అందువల్ల పై పాదాల్లో అంత్యానుప్రాసఅనే శబ్దాలంకారం ఉంది.

* కిశోర్ లేడిపిల్లలా పరుగెత్తుతున్నాడు.
జవాబు:
పై వాక్యంలో ఉపమాలంకారంఉంది.

లక్షణం : ఉపమాన, ఉపమేయములకు పోలిక చెప్పినట్లయితే ఉపమాలంకారంఅవుతుంది.

సమన్వయము : పై వాక్యంలో

  • లేడిపిల్లఅనేది ఉపమానము;
  • కిశోర్ అనేది ఉపమేయం
  • లాఉపమావాచకం
  • పరుగెత్తుతున్నాడుఅనేది సమానధర్మం.

పై విధంగా ఉపమాన, ఉపమేయములకు పోలిక చెప్పబడింది. కాబట్టి ఇది ఉపమాలంకారం.

 

* మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లున్నది.
జవాబు:
పై వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంది.

లక్షణం : సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు.

సమన్వయము : ఇక్కడ పండుగ వాతావరణంఅనేది ఉపమానం. ఇంటి వాతావరణంఅనేది ఉపమేయం. ఉపమేయం అయిన ఇంటి వాతావరణాన్ని, ఉపమానం అయిన పండుగ వాతావరణంగా ఊహించారు. కాబట్టి ఉత్ప్రేక్షాలంకారం’.

4. కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.

) ఆయన ప్రశ్నలను, సందేహాలను కోరస్కవిత ద్వారా లేవనెత్తాడు. (కర్తరి వాక్యం)
ఆయనచేత ప్రశ్నలు, సందేహాలు కోరస్కవిత ద్వారా లెవనెత్తబడతాయి. (కర్మణి వాక్యం)

) నా మీద రాళ్ళు విసురుతారు. (కర్తరి వాక్యం)
నా మీద రాళ్ళు విసరబడతాయి. (కర్మణి వాక్యం)

 

 

ప్రాజెక్టు పని

తెలుగు కవిత్వంలో అభ్యుదయ కవులుగా పేరు పొందిన ఎవరిదైన ఒకరి కవితలను సేకరించి నివేదిక రాసి, చదివి వినిపించండి.
జవాబు:
శ్రీశ్రీగా పిలువబడే అభ్యుదయ కవి శ్రీరంగం శ్రీనివాసరావుగారు. ఆయన మహాప్రస్థానంఅనే ఖండకావ్యం రాశాడు. ఆయన కవితలు రెండు పరిశీలిద్దాం.
జయభేరి
1. “
నేను సైతం,
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను”.

 

2. నేను సైతం
ప్రపంచాబ్దపు
తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను

పై గేయంపై నా అభిప్రాయం :
ఇక్కడ నేను అంటే శ్రీశ్రీ కాదు. శ్రీశ్రీ కంఠంతో పలుకుతున్న శ్రామికుడు. ప్రపంచం యొక్క అభ్యుదయం కోసం, శ్రామికుడు ఎన్నో త్యాగాలు చేశాడు. ఎంతో కృషి చేశాడు. గతంలో నేను సైతం అనే నుడికారం, మానవజాతి చరిత్రలో పేరుకు కూడా నోచుకోని ఒక సామాన్యుడికి ప్రాముఖ్యం కలిగిస్తోంది. తరతరాల నుండి ఇతడికి చరిత్రలో గుర్తింపు లేదు. ఇప్పుడితడు తిరగబడి తన ప్రాముఖ్యాన్ని గుర్తించవలసిందిగా ఘోషిస్తున్నాడు.

3. “మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం” ……………..

పై గేయంపై నా అభిప్రాయం :
పై మహాప్రస్థాన గేయం, ఒక యుద్ధగీతంలా నడచింది. ఇదొక వీరగానం. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం. ప్రస్తుత దోపిడీ వ్యవస్థ నుంచి, పీడిత సమాజం నుంచి, సామ్యవాద వ్యవస్థకి, సమసమాజ వ్యవస్థకి, ప్రయాణం చేయడమే మహాప్రస్థానం. అభ్యుదయ మార్గం వైపు ప్రస్థానం సాగించాలన్నది శ్రీశ్రీ ప్రబోధం. భావావేశానికి తగిన శబ్దప్రయోగంతో, శ్రీశ్రీ మహాప్రతిభకి గేయం అద్దం పడుతుంది. గేయం రచనా కాలంనాటికే, రష్యాలో సామ్యవాదవ్యవస్థ అనే మరోప్రపంచంఏర్పడింది.

 

మహాప్రస్థాన గేయం ఒక మహాప్రవాహం. ప్రళయ ఝంఝా ప్రభంజనం. దీని వేగానికి తట్టుకోలేక సహృదయుడు, ఉక్కిరిబిక్కిరి అవుతాడు. దీని గమనవేగం, భావతీవ్రత, అంత శక్తివంతమైనవి.

వచన కవితా పంక్తులు సారాంశము

I.

1 నుండి 6 పంక్తులు నేను

నేను
భూమికీ ఆకాశానికీ వున్న
సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు,
నేను
పువ్వుకీ ముళ్ళకీ భేదం చెప్తే
వీళ్ళు కోప్పడుతారు

భావం :
భూమికీ, ఆకాశానికీ మధ్య ఎంత దూరం ఉన్నా, వాటికి ఉన్న సహజ సంబంధాన్ని గుర్తించాలి. పూలకు ఉన్న మెత్తదనాన్ని (సుకుమారత్వాన్ని), ముళ్ళకు ఉన్న కఠినత్వాన్ని గ్రహించాలి. నేను భూమ్యాకాశాలకు మధ్య ఉన్న సంబంధం గురించి చెపితే వీళ్ళు నవ్వుతారు. ముల్లుకూ, పువ్వుకూ తేడా చెపితే, కోపిస్తారు.

 

7 నుండి 12 పంక్తులు

నేను
ప్రవాహానికీ నిశ్చలతకీ రూపం కల్పిస్తే
వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు,
నేను
ఆలోచనకీ ఆచరణకీ అర్థం చెప్తే
వీళ్ళే అపార్థం చేసుకుంటారు,

భావం :
నీటి ప్రవాహంలోని చైతన్యానికీ, కదలని నీటికి గల తేడాను అర్థం చేసుకోవాలి. ఏవేవో చేయాలనుకొనే ఆలోచనలకూ, ఏమి చేయలేనితనానికీ మధ్య గల స్థితిని తెలుసుకోవాలి. ఇవేమీ అంగీకరించకుండా, తెలుసుకోకుండా, కోపంతో అపార్థం చేసుకోవద్దని కవి కోరుతున్నాడు.

 

3 నుండి 20 పంక్తులు

నేను
మేధస్సుకీ మూర్ఖత్వానికీ
సామ్యం చూపితే వీళ్ళు
నా మీద రాళ్ళు విసురుతారు.
నాకు తెలుసు
నేను మీ ముఖాలు చూసుకొండంటూ
ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు అద్దాన్ని
ముక్కలు చెక్కలుగా పగుల గొట్టేస్తారు.

భావం :
నేను మూర్ఖుడికీ, తెలివి గలవాడికీ పోలికలు చూపిస్తే, సమాజం నామీద రాళ్ళు విసరుతుంది. మీరేమిటో మీరు తెలిసికోండని వారి ముఖం చూసుకోడానికి అద్దం చూపిస్తే, . దాన్ని ముక్కలుగా బద్దలు చేస్తుంది.

II.

1 నుండి 4 పంక్తులు నేను

నేను
గొంతెత్తి ఒంటరిగానే
పాట పాడినా మాట్లాడినా
నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు.

భావం :
కవి తాను ఎవరికోసమూ చూడకుండా, ఒంటరిగానే, తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడుతానంటున్నాడు. తన గొంతు పైకి విన్పించకుండా అణచి పెట్టాలని సమాజం ప్రయత్నిస్తుంది.

 

5 నుండి 10 పంక్తులు

నేను
ఒంటరిగా ఆలోచనలలో
ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే
నన్ను పిరికి వెధవననీ
మూర్ఖున్ననీ
చూపుడు వేళ్ళతో చంపేస్తారు

భావం :
తన పాటను అడ్డుకోవాలని, తన మాటను అణచి వేయాలని చూసేవాళ్ళకు కవి తాను భయపడనంటాడు. సమాజం తనను పిరికివాడిగా మూర్ఖుడిగా ముద్రవేసినా, తాను లెక్కచేయనని కవి పంక్తుల్లో ప్రకటించాడు.

(11 నుండి 17 పంక్తులు)

అయినా నాకు తెలుసు
రేపు వీళ్ళే
నా పాటకి కోరస్ అందుకుంటారు
నాకు భయం లేదు
నేను నేడు
పాట
ఒంటరిగానే పాడుకుంటాను !

భావం :
భవిష్యత్తులో, నేడు తనను వ్యతిరేకించిన వాళ్ళే, యథార్థాన్ని తెలుసుకొని తన మాటతో ఏకీభవిస్తారనీ, తన పాటతో గొంతు కలుపుతారనీ (కోరస్ అందిస్తారనీ), ఆశావహ దృక్పథాన్ని కవి వెల్లడించాడు. అప్పటి వరకూ తాను ఒంటరిగానే, భయం లేకుండా, తన హృదయంలోని భావనలను ప్రకటిస్తానని కవి ఆత్మవిశ్వాసంతో పలికాడు.

 

2, నవంబర్ 2023, గురువారం

VII. 7. శిల్పి

VII.7. శిల్పి  

       గుర్రం జాషువా


పాఠం ఉద్దేశం:
 అరవై నాలుగు కలలో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. నిర్జీవమైన బండరాల్లకు జీవం పోసేవాడు శిల్పి.  శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని శిల్పి కష్టాలను తెలియజేయడమే పాఠం ఉద్దేశం.


పాఠ్యభాగ వివరాలు:
 ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. వస్తువైవిద్యం కలిగిన ఖండికలతో కూడిన కావ్యమే ఖండకావ్యం అని అంటారు.

కవి పరిచయం :
కవి పేరు గుర్రం జాషువా
జననం : 28 -09- 1895 
మరణం : 24 -07 -1971
జన్మస్థలం వినుకొండ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రచనలు: గబ్బిలం ఫిరదోసి 
ముంతాజ్ 
మహల్ 
నేతాజీ 
బాపూజీ 
క్రీస్తు చరిత్ర 
నా కథ 
స్వప్న కథ 
కొత్త లోకము ఖండకావ్యాలు
శైలి : సరళంగా, వర్ణనలు కళ్ళకు కట్టినట్లు ఉంటాయి.
బిరుదులు :కవి కోకిల 
కవితా విశారద 
కళా ప్రపూర్ణ 
పద్మభూషణ్ 
నవయుగ కవి చక్రవర్తి 
మధుర శ్రీనాథ మొదలైనవి.


ప్రవేశిక 
భారతదేశం శిల్పకలకు పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే!  మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్ని ఇస్తాడు శిల్పి. వేయి స్తంభాల గుడి గ్రామప దేవాలయం గుప్తుల కాలంలో ఏకశిలారథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతను అతడి అజరామర కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం.

చుక్క పద్యాలు:
తే. గీ సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి 
బయలుపడే నిన్ని యెన్ని దేవ స్థలములు 
సార్థకముగాని యెన్ని పాషాణములకు
గలిగె నీనాడు పసుపు గుంకాల పూజ
భావం: మెత్తనైన నీ చేతి సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో! ఒకనాడు వ్యర్ధంగా పడి ఉన్నా ఎన్నో బండలకు నీవల్ల
 పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం లభించింది.(అంటే ఆ బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడు అని తాత్పర్యం.)

తే.గీ. కవి కలంబున గల అలంకార రచన 
కలదు కలదోయి శిల్పి నీ యులి ముఖమున; 
గాక పోయిన బెను రాతి కంబములకు గుసుమ వల్లరు లేరీతి గుచ్చినావు
భావం: కవి కలానికి ఉండే అలంకార రచన శక్తి నీ ఉలికి కూడా ఉన్నది. లేకపోతే కఠినమైన రాతి స్తంభంలో (పూలు లేత కొమ్మలను) పూల గుత్తులను ఎట్లా చెక్కగలిగావు?


తే. గీ. ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత 
వల్లె వేయింప గలవు చూపరుల చేత; 
గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు 
దారతమ్యంబు లేదబద్ధంబు కాదు.
భావం : చూసే వాళ్ళ చేత‌ నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యం లో బొమ్మలను చూపే కవికి నీకు ఏమాత్రం భేదం లేదు. ఇది అబద్ధం కాదు.

విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం:
కవి శిల్పిని శాశ్వతుడని ఆయన ప్రజ్ఞకు నమస్కారం చేయమని చెప్పాడు కదా దీని మద మీ అభిప్రాయం చెప్పండి
 నీకు తెలిసిన ఇతర కలలేవి ఆయా కళాకారుల గొప్పతనం ఏమిటి

ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది పద్య పాదాలు పాఠంలోని ఏఏ పద్యాల్లో ఉన్నాయి. వాటి సందర్భం ఏమిటి?
అ) బయలు పడె నెన్ని యెన్ని దేవ స్థలములు.

ఆ) తారతమ్యం లేదబద్ధంబు గాదు.

ఇ) రాళ నిద్రించు ప్రతిమల మేలుకొలుపి

ఈ) శిల్పి జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకో గల

2. కవికి - శిల్పికి మధ్య పోలికలు ఉన్న పద్యాలు ఈ పాఠంలో ఉన్నాయి. అవి ఏఏ పద్యాల్లో ఉన్నాయో గుర్తించి వాటిని రాయండి.


3.కింది గద్యాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి 
పేజి నెంబర్ 69 లోని పేరా

III స్వీయ రచన 
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. శిల్పి రాళ్లలో ఏ ఏ రూపంలో చూసి ఉంటాడు? 
జవాబు: రాళ్లను చూసిన శిల్పి మనసులో అనేక ఆకృతులుగా మలుచుకుంటాడు. దేవతామూర్తులుగా దర్శిస్తాడు. అందమైన రాతి స్తంభాలపై పూల గుత్తులు చూస్తాను. దేవాలయాలను చూసి ఉంటాడు. ఏనుగులు గున్న ఏనుగు వ్యవహార శైలి చూసుకుంటాడు. అజంతా చిత్రాలను చూసి ఉంటాడు.

ఆ. నల్లని రాళ్ళకు శిల్పి మీద కృతజ్ఞత ఎందుకు ఉండాలి?
జవాబు: నల్లని రాళ్లు కొండలపైన గుట్టల పైన ఉంటే అవి అలాగే ఉండేవి. కానీ శిల్పి చేతిలో పడిన తర్వాత వాటికి దైవత్వం వచ్చింది. దేవత మూర్తులుగా మిగులుతాయి. దేవాలయాలు అయ్యాయి. అవి ఈరోజు పసుపు కుంకుమ పుష్పాలతో వివిధ రకాల పూజలు అభిషేకాలు అందుకుంటున్నాయి. కాబట్టి నల్లని రాళ్లు, శిల్పి మీద మనం కృతజ్ఞత చూపవలసి ఉంది.

ఇ.  కవికీ, చిత్రకారుడికీ ఉండే పోలికలు, బేధాలు ఏమిటి?
జవాబు: కవి మాటలతో పదాలతో కవిత్వం రాస్తారు. చిత్రకారుడు రమణీయమైన చిత్రాలను చిత్రిస్తాడు. కవి వర్ణనలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. మనసుకు హత్తుకుంటాయి.
 చిత్రకారుడు కాగితం పైననో కాన్వాస్ మీదనో రంగులతో మరో ప్రపంచాన్ని చిత్రిస్తారు‌ దానికి పరిమితులు లేవు.

ఈ. చూసేవాళ్ళకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవు కవి ఎందుకన్నాడు?
జవాబు: చరిత్రను‌ అక్షరాలతో కాగితాలపై  చిత్రాల లో శిల్పాలపై చిత్రీకరిస్తారు. ఒక మహారాజు చరిత్రను శిల్పములుగా చెక్కితే ఆ మహారాజు చరిత్ర తెలుస్తుంది. ఆ శిల్పాల ఆధారంగా ఆ రాజు యొక్క జీవిత సంఘటనలను మనకు చూపిస్తాయి. తెలంగాణలో కాకతీయ రాజులు, తెలుగు నెలలో కృష్ణదేవరాయలు మొదలైన వారు వారి చరిత్రను శిల్పాలుగా చెక్కించుకున్నారు. వాటిని చూడగానే చూపరులకు వారి చరిత్ర చెప్పగలుగుతాయి. కాబట్టి చూసే వాళ్లకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవు అని కవి అన్నాడు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
 తెలంగాణ రాష్ట్రంలోని శిల్పకళా గురించి సొంతమాటల్లో వివరించండి.
కలలు 64 రకాలు. అందులో మనోహరమైనవి లలిత కళలు. లలిత కళలు 5. ఇందులో శిల్పకళ ఒకటి. రాయి లోహము కర్ర మట్టి మొదలైన వాటిపై దేవత విగ్రహాలు మందిరాలను నిర్మించేదే శిల్పకళ.
తెలంగాణ నుంచి పాలించిన వంశాలలో కాకతీయ రాజవంశీయులు గొప్పవారు. నేటి వరంగల్లు లో వారు నిర్మించిన కాకతీయుల పేరుని నృత్యం వేయి స్తంభాల గుడి రామప్ప పై గల శిల్పకళ చిత్రలేఖనము సంగీతం వంటి కళలను పోషించినట్లు మనకు తెలుస్తుంది.
రామప్ప గుడి వేయి స్తంభాల గుడిలో ఒక్కొక్క శిల్పంలో ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. వేయి స్తంభాల గుడి నిర్మాణం ఒక ప్రత్యేకత గలది. వేయి స్తంభాల గుడిలోని స్తంభాలన్నీ నేలను తాకకుండా నిర్మించబడినాయి. నంది విగ్రహాలు కూడా అందాలు చిందిస్తూ మనకు కనబడుతుంటాయి మనం దూరం నుండి చూసినప్పుడు విగ్రహాలు ప్రాణాలతో కూర్చున్న పెద్ద ఎద్దుల వలే దర్శనమిస్తాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం యాదగిరి నరసింహస్వామి దేవాలయం యాదాద్రిలో అద్భుతంగా శిల్పకలను ప్రదర్శిస్తుంది. 
శిల్పులు ఉలి దెబ్బల చేత రాళ్లు వివిధ భంగిమలతో అందాలను విరుద్ధమే విగ్రహాలుగా రూపుదిద్దుకున్నవి.

 లేదా 
శిల్పి గొప్పతనన్ని వివరిస్తూ సొంతమాటల్లో రాయండి.
శిల్పి గొప్పతనం తరతరాలు నివసించి ఉండడం వలన చిరంజీవిగా వెలుగొండుతాడు.
అతడు చెక్కిన సింహాలు ఏనుగులు ఎద్దులు వాటిని చూసినప్పుడు నిజమైన వాటిగా మనకు బ్రాంతి కలుగుతుంది. 
 పూర్వకాలంలో రాజుల చేత సామంతుల చేత శిల్పకళ ఆదరించబడ్డది. శిల్పులు వివిధ ఆకృతుల్లో శిల్పాలను చెక్కారు.
శిల్పకలను నేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వమే అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. శిల్పకలను పెంచి పోషించడానికి ప్రభుత్వమే చేయూతనివ్వాలి. పూర్వం శిల్పులు చెక్కిన శిల్పాలను రక్షించి వృద్ధిలోకి తేవాలి. శిల్పకలను అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.


IV. సృజనాత్మకత ప్రశంస: 
శిల్పి ని  ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా ప్రదర్శించండి. ఉదాహరణకు

నేను శిల్పి ని
మహా ఘనత వహించిన శిల్పాల సృష్టికర్త ను.
బ్రహ్మ మనుషులకు ప్రాణం పోస్తే నేను శిలలకు ప్రాణం పోసి శిల్పాలు చేస్తాను.
దేవతలు మనుషులను చేస్తే నేను దేవతలని చెక్కుతాను. అవి రాళ్లయిన చెక్క బొమ్మలైనా పసుపు కుంకాలతో పూజలు అందుకుంటాయి. వివిధ అభిషేకాలతో సేవల్ని స్వీకరిస్తుంటాయి.
నిశ్చలంగా ఉన్న శిల్పంలో అనేక భావాలు పలికించగలిగే మేము ఈనాడు దారిద్రస్థితిలో ఉన్నం
ఆదరించండి
శిల్పాన్ని మొక్కే మీరు చేసిన శిల్పిని ఆదరించండి.
దైవనామస్పనల్లో తరించే మీరు
శిల్పులకు చేయూతనివ్వండి. దయచేసి వేడుకుంటున్నా ను


V. పదజాల వినియోగం
కింది వాక్యాలు మీ పాఠంలోని వీటిలో గీత గీసిన పదాలు అర్థలు తెలుసుకొని వాటితో వాక్యాలను తిరిగి రాయండి
 అ) భయద సింహంల తలలు 
భయం కలిగించే సింహంల తలలు.
ఆ) వసుధ గన్పట్టు పర్వతములందు
జ. భూమి మీద కనిపించే పర్వతములందు
ఇ) శాశ్వతుడబోయి నీవు నిశ్చయముగాను.
నిశ్చయముగా నీవు శాశ్వతుడవు.
ఈ) తెనుగుందేశం నిన్ను వంటి పనివానించు ఉప్పొంగుచుండును
జ. నీ వంటి పనిమంతుడిని చూసి తెలుగుదేశం పొంగుతుంది.
ఉ) నీ సుత్తిలో మొలుచు  న్మానవ విగ్రహములు
జ. నీ సుత్తి నుండి మనుష్య రూపాలు పుడతాయి

2. ప్రకృతి వికృతులు
అ) సింగం బావిలో తన మొహాన్ని చూసి అది మరో సింహం ముఖం అని అనుకున్నది.
జ. సింహం - సింగం
ఆ)  కరెంటు స్తంభాలు ఉరికంబాలు కాకూడదు
జవాబు: స్తంభాలు కంబాలు
ఇ) నిద్ర మనకు అవసరమే కానీ మన నిద్దుర మొహాలం కాకూడదు
జవాబు నిద్ర నిద్దుర
ఈ) పేదలకు సహాయం చేయడం పున్నెం. ఆ పుణ్యమే మనలను నిలుపుతుంది.
జవాబు: పుణ్యం పున్నెం 

3. సూచనల ఆధారంగా పాఠ్యాంశాలు అన్ని పదాలతో గడులు నింపండి.
వల్లె
సుత్తి
దేవా
గురువు
షీలా
నమస్సులు

నేల

IV భాషను గురించి తెలుసుకుందాం.
అ) శివాలయం= శివ + ఆలయం (అ+ఆ=ఆ)
ఆ) మునీంద్రుడు= ముని + ఇంద్రుడు (ఇ+ఇ=ఈ)
ఇ) భాను ఉదయం= భాను + ఉదయం (ఉ+ఉ=ఊ)
ఈ) మాతౄణము =మాతృ + రుణము (ఋ+ఋ=ౠ)

1. కింది పదాలను విడదీయండి
హిమాలయం =హిమ + ఆలయం అ+ ఆ= ఆ
కిరీటాకృతి= కిరీట + ఆకృతి (అ+ఆ=ఆ)
మహా ఆనందం =మహా + ఆనందం (అ+ఆ=ఆ)
మహీంద్రుడు =మహి + ఇంద్రుడు (ఇ+ఇ=ఈ)
గురుపదేశం =గురు + ఉపదేశం (ఉ+ఉ=ఊ)
మాతౄణం =మాతృ + రుణం (ఋ+ఋ=ౠ)

ప్రాజెక్టు పని:
మీ గ్రామం/ప్రాంతంలోని కలలను గురించి కళాకారులను గురించి వివరాలు తెలుసుకొని వాళ్ల గొప్పదనాన్ని గురించి నివేదిక రాయండి.
సిద్దిపేట ప్రాంతంలో భాతిక్ చిత్రకళ గలదు.
శారద కాండ్రు, చిందుకళాకారులు,  దాసరులు మొదలైన కళాకారులు కలరు.  


ప్రాథమిక సమాచారం
ప్రాజెక్టు శీర్షిక: మా గ్రామం యొక్క గొప్పతనం
ప్రాజెక్టు సంఖ్య: 3
విద్యార్థి పేరు: అజ్మీర్
తరగతి: ఏడవ తరగతి
క్రమ సంఖ్య: 2
తేది: 20-09-2025
నివేదిక
1. పరిచయం
ప్రతి గ్రామానికీ ఒక ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ఉంటాయి. మా ఇబ్రహీం నగర్ గ్రామం కూడా అలాంటి విశిష్టత కలిగిన గ్రామం. ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సామాజిక సదుపాయాలు కలగలిపి ఉన్న మా గ్రామం అనేక పల్లెలకు ఆధారంగా నిలుస్తోంది.

2. రాజన్న వాగు
మా గ్రామానికి జీవనాధారంగా నిలిచినది రాజన్న వాగు. ఈ వాగు వ్యవసాయానికి నీటిని అందిస్తుంది. రైతులు పంటలు పండించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. వర్షాకాలంలో వాగు నిండుగా ప్రవహించడం గ్రామానికి ఆనందాన్ని ఇస్తుంది. ఇది ప్రకృతి వరంగా భావించబడుతుంది.

3. బండమీది శివాలయం
గ్రామానికి ఆధ్యాత్మిక చైతన్యం నింపేది బండమీది శివాలయం. ఎత్తైన బండపై ఉన్న ఈ దేవాలయం ఎంతో పురాతనమైనది. శివరాత్రి పండుగ సందర్భంగా గ్రామస్థులు పెద్ద ఎత్తున భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయం గ్రామ ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది.
4. ఇబ్రహీం నగర్ బోనమ్మ తల్లి దేవాలయం
బోనమ్మ తల్లి దేవాలయం గ్రామస్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా ఉంది. ప్రతి సంవత్సరం జరిగే జాతరలో గ్రామమంతా ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ దేవాలయం గ్రామ సంప్రదాయాలను కాపాడుతోంది.
5. చెరువు
మా గ్రామంలోని చెరువు రైతులకు, పశువులకు నీటి అవసరాలను తీర్చుతుంది. ఇది భూగర్భ జలాలను పెంచుతుంది. చెరువు చుట్టూ పచ్చని వాతావరణం ఉంటుంది. ఇది గ్రామానికి అందాన్ని తెస్తుంది.
6. బురుజు
గ్రామ చరిత్రను తెలియజేసేది బురుజు. ఇది పూర్వ కాలంలో నిర్మించబడిన నిర్మాణం. గ్రామ రక్షణకు ఉపయోగపడినట్లు పెద్దలు చెబుతారు. ఇది గ్రామ గౌరవానికి చిహ్నంగా నిలుస్తోంది.
7. ప్రాథమిక చికిత్స కేంద్రం
మా గ్రామంలో ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రం ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు వెంటనే చికిత్స లభిస్తుంది. ఇది గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగకరం.
8. కూడలి
మా గ్రామంలోని కూడలి అనేక పల్లెలను కలిపే కేంద్రంగా ఉంది. ఇక్కడ ప్రజలు కలుసుకుని సమాచారాన్ని పంచుకుంటారు. రవాణా సౌకర్యానికి ఇది ముఖ్యమైన స్థలం.
9. మా గ్రామం యొక్క ప్రాముఖ్యత
ఇబ్రహీం నగర్ గ్రామం ప్రకృతి, భక్తి, చరిత్ర, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది. అందువల్ల ఇది సమీప పల్లెలకు ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది.
ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్న అంశాలు
1. మా గ్రామ చరిత్ర మరియు ప్రత్యేకతలను తెలుసుకున్నాను.
2. గ్రామంలోని సహజ వనరుల ప్రాముఖ్యతను గ్రహించాను.
3. దేవాలయాలు గ్రామ సంస్కృతిని కాపాడుతాయని తెలుసుకున్నాను.
4. చెరువు, వాగు వ్యవసాయానికి ఎంత అవసరమో అర్థమైంది.
5. ఆరోగ్య కేంద్రం వంటి సదుపాయాలు గ్రామాభివృద్ధికి అవసరమని తెలుసుకున్నాను.
6. గ్రామ ఐక్యతే గ్రామ శక్తి అని తెలుసుకున్నాను.
ముగింపు
మా ఇబ్రహీం నగర్ గ్రామం ప్రకృతి సంపదలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సామాజిక సదుపాయాలతో అనేక పల్లెలకు ఆధారంగా నిలుస్తోంది. మా గ్రామం పై నాకు గర్వంగా ఉంది. భవిష్యత్తులో కూడా మా గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.