సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

21, అక్టోబర్ 2025, మంగళవారం

తెలుగు విశేషాలు

తెలుగు - సంస్కృత పదాల గుర్తింపు

తెలుగు పదమేదో, సంస్కృత పదమేదో తెలియకపోవడం వల్ల వ్యాకరణ బోధనలో కాస్త ఇబ్బంది అవుతుంది.. ఏవి సంస్కృత పదాలు ? ఏవి తెలుగు పదాలు ? అని సులభంగా తెలుసుకోవడం ఎలా?

తెలుగు ఉపాధ్యాయులకు ఇది చాలా అవసరమైన విషయం, తెలుగు నిఘంటువు చూసి, పదం పక్కన ఉన్న సూచనను బట్టి ఏది సంస్కృత పదమో, ఏది తెలుగుపదమో తెలుసుకోవచ్చు . నిఘంటువు అందుబాటులో లేనప్పుడు ఇలా గుర్తించండి. .

  1. ప్రధమ విభక్త ప్రత్యయాలు చివరలో ఉండే పదాలు తత్వమ పదాలు.

  2. విసర్గ ( : ) ఉన్న పదం సంస్కృత పదమే.

  3. మహాప్రాణాక్షరాలు (10) సంస్కృతభాషలోనే ఉంటాయి. ఇవి, వీటి గుణింతాలతో ఉండే పదాలు సంస్కృత పదాలే.

  4. దీర్ఘ సమాసాలుగా ఉన్న పదాలలో కనబడే పదాలన్నీ సంస్కృత పదాలే.

  5. ప్రకృతి వికృతులలో ప్రకృతి పదాలన్నీ సంస్కృత పదాలే.

  6. తెలుగులో ద్విత్యాక్షరాలు ఉంటాయి గానీ సంయుక్తాక్షరాలు ఉండవు. ( అన్న ఉంటుంది గానీ, అన్వ ఉండదు)

  7. సవర్ణదీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణసంధి, యణాదేశ సంధి, విసర్ల సంధులలోని పదాలన్నీ సంస్కృత పదాలే.

  8. తెలుగు పదాల మధ్య తెలుగు సంధి జరుగుతుంది. సంస్కృత పదాల మధ్య సంస్కృత సంధి జరుగుతుంది. ఉదా. రామయ్య, సీతమ్మ, చింతాకు వంటివి తెలుగు సంధులు. రామ + అయ్య, సీత + అమ్మ, చింత + ఆకు. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పగూడదు. అయ్య, అమ్మ, ఆకు తెలుగు పదాలు చేరి ఇక్కడ అత్వ సంధి వస్తుంది. రామ + అయన లో రెండూ సంస్కృత పదాలు ఉన్నాయి కాబట్టి సవర్ణదీర్ఘ సంధి వస్తుంది.

  9. తెలుగు పదాలు సామాన్యంగా చాలా చిన్నవిగా రెండు మూడు అక్షరాలు కలిగి ఉంటాయి. రెండు పదాలకు మించి సమాసం కనబడితే అందులో పదాలు తెలుగువి కాదు అని గుర్తుపట్టవచ్చు. ఉదా:- కూరగాయలు, చదువు సందలు, పెద్దదక్వ, చల్లటివెన్పుల, మంచి అబ్బాయి — లాంటి చిన్న సమాసాలే తెలుగులో ఉంటాయి. అంబరచుంది శిరస్యురట్జరీపటల వంటి సమాసాలలో ఉండేవి సంస్కృత పదాలే.

  10. ఎ ఒ లు, వాటితో హల్లు చేరిన పదాలూ తెలుగువే. సంస్కృతం లో ఏ, ఒ ఉంటాయి గానీ ఎ, ఒ ఉండవు. తెలుగులో ఎ ఎ ఓ ఓ ఈ నాలుగూ ఉంటాయి.

  11. అమేడిత సంధి సంస్కృత సంది కాదు. అందులో వచ్చె పదాలు తెలుగు పదాలే. ఉదా :- బారార, ఏమెవెమి కట్ల కడ బాలవ్యాకరణంలో చిన్నయసూరి అచ్చ తెలుగులో ఉండే అక్షరాలు ఏవో సూచించారు. ఒకసాది పరిశీలించగలరు వెరపు మెకమ పేరు కోసం (తె) పోరు గోరు గోణుగు కోరి ఉదా:- కోవం, గోప్యం, పోషణ, భోజనం, మేషం, తోషణం, ఏక, వేషం (సం) ఎవరు, ఏమి, వేగు జామ, వేగలేను, వెపన్, పోక, పొగరు సేకరణ: siddenky.blogspot.com


భళారే... తెలుగు!

ఒకప్పుడు ప్రముఖ పాత్రికేయులు శ్రీ భండారు శ్రీనివాసరావుగారు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన ఈ క్రింది ఆంగ్ల వాక్యాన్ని పోస్ట్ చేశారు: 

An Amazing Sentence in English

Remarkable indeed! The person who made this sentence must be a GENIUS in English vocabulary.

"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness.''

ఈ వాక్యంలో ఇరవై పదాలున్నాయి. ఒకటవ పదంలో ఒక అక్షరం, రెండవ పదంలో రెండు అక్షరాలు, మూడవ పదంలో మూడు అక్షరాలు, ఈ విధంగా అక్షరవృద్ధిక్రమంలో ఇరవయ్యవ పదంలో ఇరవై అక్షరాలు ఉన్నాయి. 

ఇదొక అపురూపమైన చిత్ర రచన. దీనికి ప్రతిగా తెలుగు భాషకు గల శక్తిని వెల్లడిస్తూ ఏల్చూరి మురళీధరరావు గారు ఈ క్రింది వాక్యాన్ని ప్రకటించారు:   

“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,
రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!

పై వాక్యంలో 26  అక్షరవృద్ధి దళాలున్నాయి. మొదటి దళం ఒక అక్షరం, రెండవ దళం రెండక్షరాలు, మూడవ దళం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ దళం ఇరవై ఆరు అక్షరాలతో అక్షరవృద్ధిక్రమంలో కూర్పబడి ఉన్నాయి. 

1. ఏ
2. మంచి
3. కవైనా
4. విశ్వనాథ
5. గ్రంథావళిని
6. చదవకపోతే
7. కవిత్వరచనలో
8. పద్యనిర్మాణశక్తికి,
9. సద్గుణాలంకారవ్యక్తికి,
10. రసోచితశబ్దార్థయుక్తికి,
11. సుమకోమలభావభావనకు,
12. నవ్యసంప్రదాయపదగుంఫనకు,
13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,
14. పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు,
15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,
16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,
17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు,
18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,
19. ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు,
20. రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి,
21. నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,
22. అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి,
23. శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి,
24. గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి,
25. ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి,
26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!  

తెలుగు భాషాభిమానుల ఆసక్తి కారణంగా ఈ వాక్యం అచిరకాలంలోనే ఫేస్ బుక్ లోనూ, అంతర్జాలంలోనూ, వాట్సాప్ మాధ్యమం ద్వారానూ, వివిధ పత్రికలలోనూ పాతికవేలకు పైగా పర్యాయాలు సంచరిస్తుండటం విశేషం!

భళారే ... తెలుగు!👍

-సేకరణ 

వర్ణమాలతో పెళ్లి

*వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం... తెలుగు అక్షరాలన్నింటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉందో మీరే చూడండి...🌹🥰*

*అ -* అరుదైన అమ్మాయి
*ఆ -* ఆకతాయి అబ్బాయి
*ఇ -* ఇద్దరికి
*ఈ -* ఈడు జోడి కుదిరి
*ఉ -* ఉంగరాలను తొడిగి
*ఊ -* ఊరంతా ఊరేగించారు
*ఋ -* ఋణాల కోసం
*ఎ -* ఎవరెవరినో అడుగుతూ ఉంటే
*ఏ -* ఏనుగు లాంటి కుభేరుడితో అడిగి
*ఐ -* ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి
*ఒ -* ఒకరికి ఒకరు వియ్యంకులవారు
*ఓ -* ఓర్పుతో ఒప్పందం చేసుకొని
*ఔ -* ఔదార్యాని ఇరు కుటుంబాలకు
*అం -* అందించాలని కోరుకుంటూ
*అ -* అంటూ
*క -* కలపతో తయారయిన పత్రికలపై
కలంతో రాసిచ్చి
*ఖ -* ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను
*గ -* గడప ముందుకు తీసుకొచ్చి
*ఘ -* ఘనమైన ఏర్పాట్లు చేయించి
*చ -* చాపుల (బట్టలు)నింటిని కొని
*ఛ -* ఛత్రం (గొడుగు) పట్టి గండదీపాని
*జ -* జరిపిస్తూ
*ఝ -* ఝాము రాత్రి దాక
*ట -* టపకాయలను కాలుస్తూ
*ఠ -* ఠీవిగా (వైభవంగా)
*డ -* డప్పులతో
*ఢ -* ఢం ఢం అని శబ్దాలతో సాగుతుంది
*ణ -* కంకణాలు చేతికి కట్టుకొని
*త -* తట్టలో తమలపాకులు పట్టుకొని
*థ -* థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో
*ద -* దగ్గరి బంధువులను పిలిచి
*ధ -* ధనవంతులను కూడా పిలిచి
*న -* న అనే నలుగురిని పిలిచి
*ప -* పది మందిని పలకరిస్తూ
*ఫ -* ఫంక్షన్ కి రావాలని చెప్తూ
*బ -* బలగాలతో బంగార దుకాణాలకు వెళ్లి
*భ -* భటువులని (ఆభరణాలు) కొని
*మ -* మంగళ స్నానాలు చేయించి, రాజసూయ
*య -* యాగం లాంటి పెళ్లికి
*ర -* రారండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి
*ల -* లక్షణమైన
*వ -* వధూవరులను మీరు
*శ -* శతమానం భవతి అని
*ష -* షరతులు లేకుండా ఆశీర్వదించడానికి
*స -* సప్తపది (పెళ్లి) వేడుకలో
*హ -* హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో
*ళ -* క ళ త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని
*క్ష -* క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లికి
*ఱ -* ఱరండి

*వర్ణమాల పెళ్లి...🌹🥰*

- సేకరణ